- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
JK Assembly: ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం

దిశ, నేషనల్ బ్యూరో : పహెల్గాం (Pahalgam) ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. పహెల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ముక్తకంఠంతో శాసనసభ ఉగ్రదాడిని ఖండించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘటన దారుణం అని సభ పేర్కొంది. పిరికి చర్యగా అభివర్ణించింది. వారి మరణాలపట్ల సంతాపం ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రదాడిపై సభలో చర్చించారు. తర్వాత మృతులకు నివాళి అర్పించారు. ఓ ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కునే క్రమంలో తూటాలకు బలైన స్థానికుడు షహీద్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ త్యాగానికి సభ వందనం చేసింది. ఆపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు. మరోవైపు, ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ ఉగ్రవాద దాడిని ఖండించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని మరియు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
జమ్ముకశ్మీర్ సీఎం ప్రసంగం
పహెల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శక్తిమంతమైన ప్రసంగం చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా కశ్మీర్ మొత్తం ఐక్యంగా ఉందన్నారు. ఇది లోయలో "ఉగ్రవాదం ముగింపునకు నాంది" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పర్యాటకులకు క్షమాపణలు చెప్పారు. " ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా నేను వారిని ఇక్కడికి స్వాగతించాను. ఒక విధేయుడిగా, వారు సురక్షితంగా తిరిగి నిర్ధారించడం నా బాధ్యత. క్షమాపణ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. రక్తంతో తడిసిన తమ తండ్రులను చూసిన ఆ పిల్లలకు, రోజుల క్రితం వివాహం చేసుకున్న ఆ నేవీ అధికారి వితంతువుకు నేను ఏమి చెప్పగలను? తాము చేసిన తప్పు ఏంటని మమ్మల్ని అడిగారు?" అని ఆయన అన్నారు. కశ్మీర్ ప్రజల కోసమే ఉగ్రదాడి చేసినట్లు ముష్కరులు చెప్తున్నారని అన్నారు. కానీ, తాము ఈ దాడి చేయమని అడిగామా? అని ప్రశ్నించారు. "ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, అరుణాచల్ నుండి గుజరాత్ వరకు, జమ్ముకశ్మీర్ నుండి కేరళ వరకు దేశవ్యాప్తంగా ప్రజలు దీనికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారు నా పేరు మీద నిరసన చేపట్టలేదు. ఇది ఆకస్మికంగానే జరుగుతుంది" అని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహెల్గాం ఉగ్రదాడిని రాజకీయం చేయబోమని స్పష్టం చేశారు. అమాయక పౌరుల మృతదేహాలతో రాజకీయం చేసి రాష్ట్రహోదాను డిమాండ్ చేయబోమన్నారు. మానవ జీవితాలను రాజకీయ బేరసారాల చిప్‌గా మార్చబోనని అన్నారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు.