World Chess Championship : మూడో గేమ్‌లో గుకేశ్‌ గెలుపు

by Sathputhe Rajesh |
World Chess Championship : మూడో గేమ్‌లో గుకేశ్‌ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌‌లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ విజయం సాధించాడు. మూడో గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌పై విజయం సాధించాడు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. ఫలితంగా 1.5-1.5 పాయింట్లతో లిరెన్‌ను సమం చేశాడు. తొలి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్ల పావులతో ఆడుతూ డింగ్ లిరెన్‌కి టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఎదురైన సమస్యలను సద్వినియోగం చేసుకుని ఫలితాన్ని రాబట్టతాడు. 120 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో గుకేష్ వేగంగా, ఖచ్చితమైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. డింగ్ తన 37వ ఎత్తులో సమయం మించిపోయాడు. దీంతో భారత గ్రాండ్ మాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed