- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
UPI Transactions: డిసెంబర్‌లో రికార్డు స్థాయికి చేరిన యూపీఐ లావాదేవీలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, 2024 డిసెంబర్‌లో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 1,673 కోట్లకు చేరుకున్నాయి. ఇవి అంతకుముందు నెల కంటే 8 శాతం పెరిగాయి. నవంబర్‌లో మొత్తం 1,548 కోట్ల లావాదేవీలు జరిగాయి. విలువ పరంగా నవంబర్‌లో రూ. 21.55 లక్షల కోట్లు జరగ్గా, డిసెంబర్‌లో రూ. 23.25 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్‌పీసీఐ తెలిపింది. సమీక్షించిన నెలలో సగటున రోజుకు రూ. 74.900 కోట్లు నమోదయ్యాయి. ఇది నవంబర్‌లో రూ. 71,840 కోట్ల కంటే 4 శాతం అధికం. దేశీయంగా డిజిటల్ లావాదేవీలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎన్‌పీసీఐ పేర్కొంది. చాలా బ్యాంకులు యూపీఐ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. 2023లో యూపీఐ సేవలు అందించే బ్యాంకుల సంఖ్య దాదాపు 500 ఉండగా, 2024లో 620కి పైగా బ్యాంకులు ఈ సేవలనందిస్తున్నాయి.