- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే జై వీర్

దిశ,హాలియా : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు . సన్న బియ్యం పథకం లో భాగంగా మంగళవారం హాలియాలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా సన్న బియ్యం పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. సన్న బియ్యం పథకం ద్వారా పేదలకు వందశాతం లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.
గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా అవినీతి తారాస్థాయికి చేరిందని రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మడం ద్వారా అవినీతి మరింత పెరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని అడ్డుకోవడం కోసమే లబ్ధిదారులకు నేరుగా సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు సన్న బియ్యం పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ కాల్ సాని చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి మండల తహసీల్దార్ వై. రఘు, చింతల చంద్రారెడ్డి, గౌని సుధారాణి, రాజా రమేష్ యాదవ్ ,పిల్లి ఆంజనేయులు, కుందూరు రాజేందర్ రెడ్డి, మజా హర్, గడ్డం రమణయ్య, నకిరేకంటి సైదులు పలువురు డీలర్లు పాల్గొన్నారు.