- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్త్రీ విద్యకు సావిత్రీభాయి పూలే కృషి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: బహుజనులను కట్టడిచేసే సామాజిక సంప్రదాయ నిర్బంధాలను తొలగించి బడుగుల అభ్యున్నతికై, స్త్రీ విద్యకై తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3న సావిత్రీ భాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చేసిన సామాజిక కృషిని, స్త్రీ జాతి ఔన్నత్యం కోసం, అణచివేయబడిన కులాల స్వేచ్ఛ కోసం కోసం మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి ఫూలే దంపతుల త్యాగాలను స్మరించుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందటానికి, వారి హక్కులు కాపాడబడటానికి, త్యాగాలు చేసిన మహనీయుల్లో మహాత్మా ఫూలే దంపతులు ముందువరుసలో వుంటారని తెలిపారు. సామాజిక రాజకీయ సాంస్కృతిక ఆర్థిక రంగాల్లో దళిత బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పదేండ్ల అనతికాలంలో కుదురుకున్నదని అన్నారు.
మహాత్మా ఫూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలను అందిస్తుందన్నారు. దళిత బహుజన వర్గాలకు పట్టుకొమ్మలైన పల్లె తెలంగాణ నేడు ప్రగతి పథంలో పయనిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందన్నారు. గురుకుల విద్య తో సహా, బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో,విద్యారంగంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రీ బాయి ఫూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉన్నాయన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలను ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలను స్థాపించమని గుర్తుచేశారు.మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాలలో నిత్య చైతన్యాన్ని నింపడం ద్వారా మాత్రమే సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులకు మనమందించే ఘన నివాళి అని పేర్కొన్నారు.