అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా.. రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు

by Harish |
అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా.. రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు వార్తలు ఎక్కవయ్యాయి. తాజాగా రిటైర్మెంట్ వార్తలను రోహిత్ శర్మ ఖండించాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశాడు. ఐదో టెస్టుకు దూరంగా ఉంటే వీడ్కోలు పలుకుతున్నట్టు అర్థం కాదన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..‘నేను పరుగులు చేయడం లేదు. ఫామ్‌లో లేను. ఐదో టెస్టులో విజయం సాధించడం మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. కాబట్టి, మాకు ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫామ్ లేని వాళ్లు జట్టును మోయలేరని భావించా. ఇదే విషయాన్ని కోచ్, చీఫ్ సెలెక్టర్‌కు చెప్పా. వారు నా నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఐదో టెస్టు నుంచి తప్పుకోవడం నాకు చాలా కష్టమైన నిర్ణయం.’ అని చెప్పాడు. రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ..‘ఐదు నెలల తర్వాత జరిగే దానిపై నాకు నమ్మకం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌పై వర్తమానంపైనే ఉంది. ఐదు టెస్టులో తప్పుకుంటే రిటైర్మెంట్‌ తీసుకున్నట్టు కాదు. నేను ఆటకు దూరం కాను. పరుగులు చేయడం లేదు కాబట్టే సిడ్నీ టెస్టుకూ దూరమయ్యాను. ఐదు నెలల తర్వాత రన్స్ చేయనని గ్యారంటీ లేదు. నాపై నాకు నమ్మకం ఉంది.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆసిస్ గడ్డపై పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 రన్సే చేశాడు.


Advertisement

Next Story

Most Viewed