Rahul gandhi: యువతకు నాణ్యమైన విద్య అందించాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |   ( Updated:2025-01-04 19:00:22.0  )
Rahul gandhi: యువతకు నాణ్యమైన విద్య అందించాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ యువతకు నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నొక్కి చెప్పారు. మంచి భవిష్యత్ కోసం ప్రస్తుత విద్యా విధానంపై పునరాలోచించాలని సూచించారు. తాజాగా ఆయన ఐఐటీ మద్రాస్ (IIT madras) విద్యార్థులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రధానమైన బాధ్యత అని తెలిపారు. ప్రయివేటీకరణ, ఆర్థిక ప్రోత్సాహకాలతో ఈ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుత విద్యా విధానం యువతను డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్, సాయుధ బలగాలకే పరిమితం చేస్తోందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా ఎడ్యుకేషన్ పాలసీపై సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ కొట్టి పారేసింది. మోడీ నాయకత్వంలో దేశంలో అనేక విద్యా సంస్కరణలు వచ్చాయని తెలిపింది.

Advertisement

Next Story