DK Aruna: ఏడాది కాలంలో తెచ్చిన మార్పు ఇదేనా..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
DK Aruna: ఏడాది కాలంలో తెచ్చిన మార్పు ఇదేనా..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏడాది కాలంలో తెచ్చిన మార్పు ఇదేనా అని మహబూబ్ నగర్(Mahaboobnagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లలో సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లుడుతూ.. ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు దాదాపు 58 మంది పిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక కాంగ్రెస్ పాలనలో ఏడాది కాలంలో వచ్చిన మార్పు ఇది అని, పిల్లలకు కనీసం నాణ్యమైన భోజనం పెట్టరు సరికదా.. కల్తీ ఆహారంతో వాళ్ల ఉసురు తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డిది కళ్లున్నా చూడలేని ప్రభుత్వం.. నోరున్నా మాట్లాడని ప్రభుత్వం.. ఇదేం ఖర్మ మన తెలంగాణ రాష్ట్రానికి! అని బీజేపీ నేత రాసుకొచ్చారు.

Advertisement

Next Story