పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా

by Harish |
పాక్‌కు షాక్.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా రెండో టెస్టులోనూ నెగ్గి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కేప్‌టౌన్ వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ కూడ కోల్పోకుండా అలవోకగా ఛేదించింది. మొదట ఫాలో ఆన్‌‌లో పాక్ ఓవర్‌నైట్ స్కోరుతో 213/1తో సోమవారం ఆట కొనసాగించి 478 రన్స్ చేసింది. మసూద్(145) శతకంతో రాణించగా.. సల్మాన్ అఘా(48), రిజ్వాన్(41) విలువైన పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, మహరాజ్ మూడేసి వికెట్లు, జాన్సెన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని మార్‌క్రమ్(14 నాటౌట్) సహకారంతో డేవిడ్ బెడింగ్‌హామ్(47 నాటౌట్) సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో నాలుగు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా.. పాక్‌ను 194 రన్స్‌కే ఆలౌట్ చేసి 421 పరుగుల భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా 7వ విజయం.

Advertisement

Next Story