Teenmar Mallanna: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు

by Gantepaka Srikanth |
Teenmar Mallanna: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్కే భవన్‌లో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కార్ రైతుల కోసం చేస్తున్న పనులపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలు జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. ధరణితో కల్వకుంట్ల కుటుంబం భూ దోపిడీ చేసిందని గుర్తు చేసుకున్నారు. భూ భారతితో రైతులకు భూ సమస్యలు ఉండవన్నారు. మొదటిసారిగా రైతు కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శాలువాతో సన్మానించారు.

Next Story

Most Viewed