- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీసీఐ సెక్రెటరీగా దేవ్‌జిత్ సైకియా!.. కార్యదర్శి పోస్టుకు ఒకే నామినేషన్
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ సెక్రెటరీగా దేవ్‌జిత్ సైకియా ఎన్నిక ఏకగ్రీవమైనట్టే. కార్యదర్శి పోస్టుకు సైకియా ఒక్కరే నామినేషన్ వేశారు. శనివారంతో నామినేషన్ వేయడానికి గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో దేవ్‌జిత్ సైకియా సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో సెక్రెటరీ పోస్టు ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాయింట్ సెక్రెటరీగా ఉన్న దేవ్‌జిత్ సైకియాను తాత్కాలిక సెక్రెటరీగా నియమించారు. అలాగే, కోశాధికారి పదవికి ప్రభ్‌తేజ్ భాటియా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఈ నెల 6న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 12వ తేదీన ఎన్నిక జరగనుంది. ఎన్నికకు జనరల్ బాడీ ఆమోదానికి అదే రోజు బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్‌ను నిర్వహించనుంది. భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
- Tags
- #BCCI