- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుమ్రా బౌలింగ్ చేయకపోతే భారత్ గెలవడం కష్టమే : సునీల్ గవాస్కర్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో భారత్ విజయావకాశాలు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే ఆధారపడి ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వెన్ను నొప్పితో శనివారం బుమ్రా మైదానం వీడాడు. ఆదివారం అతను బౌలింగ్ చేస్తాడా?లేదా? అన్నది స్పష్టంగా తెలియదు. దీనిపై సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..‘భారత్ ఇంకా 45 పరుగులపైనా రన్స్ చేసినా లేదా స్కోరు బోర్డు 185 స్కోరు పెట్టినా మెరుగైన అవకాశాలు ఉంటాయి. కానీ, బుమ్రా ఫిట్‌నెస్‌పైనే భారత్ చాన్స్‌లు ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఫిట్‌గా ఉంటే 145-150 స్కోరైనా సరిపోతుంది. కానీ, అతను ఫిట్ లేకుంటే మాత్రం 200 లక్ష్యమైనా సరిపోదు.’ అని గవాస్కర్ తెలిపాడు. అలాగే, బుమ్రా లభ్యతపై గోప్యత పాటించాలని టీమ్ మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకుందన్నాడు. బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు తెలియడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మక కోణంలో బుమ్రా బౌలింగ్ చేస్తాడా?లేదా? అన్నవిషయాన్ని ప్రకటించకూడదన్నాడు. వ్యూహాలను అమలు చేయాలంటే గోప్యత చాలా ముఖ్యమని చెప్పాడు.