Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రహస్య పొత్తు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ

by vinod kumar |
Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రహస్య పొత్తు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp) పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య రహస్య పొత్తు ఉందని ఆరోపించారు. బయటకు మాత్రమే ఒకరితో ఒకరు విభేదించుకుంటున్నారని విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెరవెనుక పొత్తు ఆమోదయోగ్యం కాదని.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీజేపీలు తమ పొత్తును అధికారికంగా ప్రకటించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు.

పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం తమ వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్‌లోని కేజ్రీవాల్ నివాసం ఎదుట పలువురు మహిళలు నిరసన చేపట్టారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. వారిని కాంగ్రెస్, బీజేపీలే పంపాయని ఆరోపించారు. ‘ఆందోళన చేపట్టిన మహిళది పంజాబ్ కాదు. వారంతా ఈ రెండు పార్టీలకు చెందిన వారే. పంజాబ్‌లోని మహిళలందరూ ఆప్‌తో ఉన్నారు. వారు మమ్మల్ని నమ్ముతారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed