- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజభక్తిని, స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న ఏసీబీ : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్షాల గొంతునొక్కడానికి ప్రభుత్వం క్షుద్ర రాజకీయ క్రీడ ఆడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇష్టా రాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయానికి కేసు పెట్టారన్నారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని, చట్టాన్ని పోలీసులు గౌరవించడం లేదు అన్నారు. విచారణ సంస్థలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి పరోక్షంగా ఇచ్చే నజరానాలు, హోదాలు, తాయిలాలకు, ప్రలోభాలకు అధికారులు గురి కావొద్దు అన్నారు. చట్టబద్దంగా పోలీసులు వ్యవహరించాలని కోరారు.
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ రాజభక్తిని, స్వామిభక్తిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేసులో జూబ్లీహిల్స్ రేవంత్ ఇంట్లో బహిరంగ విచారణకు సిద్దమని, ప్రభుత్వం శాసనసభలో చర్చ పెడతామంటే ఎందుకు అనుమతించ లేదు?అని ప్రశ్నించారు. మీడియా సమక్షంలో బహిరంగ విచారణకు సిద్దం .. దమ్ముంటే చర్చ పెట్టాలని సవాల్ చేశారు.చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా చూయిస్తూ సైకో ఫ్యాన్సీని పెంచే ప్రయత్నం కనిపిస్తుందని, ఫార్ములా ఈ కార్ ఒప్పందం విషయంలో కేటీఆర్ పై ఏసీబీ పెట్టింది తప్పుడు కేసు అన్నారు. విచారణ సంస్థలు విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడమే కాకుండా .. అది నిస్పక్షపాతంగా జరుగుతున్నట్టు ప్రజలు భావించేలా చూడడం ఆ సంస్థ బాధ్యత అన్నారు. ఏసీబీకి ఎలాంటి దురుద్దేశం లేకపోతే న్యాయవాదులను ఎందుకు అనుమతించడం లేదు? అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు.
- Tags
- NIRANJAN REDDY