- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Excise: అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు.. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరి కిరణ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్సైజ్ శాఖలో అర్హత కలిగిన అధికారుల నుంచి సిబ్బంది వరకు రావాల్సిన ప్రమోషన్లను ఇస్తున్నామని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ చెవ్వూరు హరికిషన్ తెలిపారు. జనవరిలోగా ప్రమోషన్ల ప్రక్రీయ పూర్తి అవుతుందని అన్నారు. తెలంగాణ నాన్ గేజి టేడ్ ఉద్యోగుల సంఘాలతో కొత్త సంవత్సరం గేట్ టూ గేదర్ కార్యక్రమం అబ్కారీ భవన్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌తోపాటు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ వి.బి.కమలాసన్‌రెడ్డి, సెంట్రల్ టీఎన్టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం ముజీబ్ లు హాజరయ్యారు. ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ చెవ్వూరు హరికిషన్ మాట్లాడుతూ ఎన్ ఫోర్స్‌మెంట్ బాగా పని చేస్తే ఎక్సైజ్ శాఖ రీసోర్స్ పెరుగుతుందని అన్నారు.
నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను అరికట్టడం వల్లనే ఈ డిసెంబరు నెలలో రావాల్సిన ఆదాయం కంటే 10 శాతం అధికంగా సెల్స్ పెరగడంతో శాఖకు మేలు జరిగిందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బెన్ఫిట్స్ ను ఉద్యోగ సంఘాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాయని, అందరు బాగా పని చేయాలని కోరారు. 2024లో ఎక్సైజ్ లా ఎన్ ఫోర్స్ బాగా పని చేశాయని, 2025లో మరింతగా పనిచేయాలని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ అడిషనర్ కమిషనర్ అజయ్‌రావు, జాయింట్‌కమిషనర్లు ఖురేషి, కె ఏబీ శాస్త్రీ, డిప్యూటి కమిషనర్లు హరి కిషన్, డేవిడ్ రవికాంత్ , దశరథ్, రఘురాం , శ్రీనివాస్‌లతోపాటు ఇతర అధికారులు హజరయ్యారు.