- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhatti: ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈనెల 9న న్యూ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందని ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది ఏఈలకు సోమవారం నియామకపత్రాలను అందజేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేకపోయిందని విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. న్యూ ఎనర్జీ పాలసీని ఈనెల 4న నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించినట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల అమలుచేస్తున్న ఎనర్జీ పాలసీతో పాటు తెలంగాణలో అందుబాటులో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కావల్సిన అన్ని అంశాలను అధ్యయనం చేసి న్యూ ఎనర్జీ పాలసీని తయారుచేసినట్లు చెప్పారు.
2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ట్రాన్స్ మిషన్ వ్యవస్థను కూడా అందుకు తగ్గట్టుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్రణాళికను తయారుచేసుకున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రామగుండంలో జెన్కో సింగరేణి సంస్థ కాలరీస్ లిమిటెడ్ సంయుక్తంగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న నైనీ బ్లాకును గాలికి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఒరిస్సా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చించి సింగరేణి సంస్థకు నైనీ కోల్ బ్లాక్ ను అప్పగించినట్లు చెప్పారు. నైనీ కోల్ బ్లాకు పక్కనే థర్మల్ పవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని భట్టి వివరించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెంపుదలలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సోషల్ మీడియా, తమకు అనుకూలంగా ఉండే పత్రికలు చేతుల్లో ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉండటంలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు విశ్వసించరని భట్టి పేర్కొన్నారు.
చెమట చుక్కలకు తర్ఫీదు లోగో ఆవిష్కరణ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన చెమట చుక్కలకు తర్ఫీదు లోగోను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సింగరేణి విస్తరించి ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని మంచి స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి సింగరేణి శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి సింరేణి సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, జెన్కో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.