- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ ఇంటిపై రైడ్ లు చేసి కేస్ కి సంబంధించి ఏమైనా పేపర్లు పెట్టి ఎలాగైనా ఇరికించాలని కుట్రలు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉందని, తప్పకుండా మీ కుట్రలను చేధిస్తాం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తుండని, నీ రేవంత్ రెడ్డి రాజ్యాంగంతో చేసే కుట్రలను భారత రాజ్యాంగంతోనే చేదిస్తామని తెలిపారు. కేటీఆర్ పై, ప్రశ్నించే వారిపై కేసులతో కుట్రలు చేయడం లాంటి పిచ్చి పనులు మానుకోవాలని సూచించారు. పోలీసులు కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం అంటే అన్ని రోజులు ఒకలా ఉండవు.. సమయం వచ్చినప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా రెండే కార్యక్రమాలు చేస్తున్నాడని, ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. రైతు భరోసా పై మాట తప్పిండు, ఒక రైతు భరోసా ఎగ్గొటిండు అని మండిపడ్డారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే అమలు చేశాడని, కోడలికి 2500,అత్తకు 4000 ఇస్తా అన్నాడు.. కళ్యాణ లక్ష్మీ తో పాటు తులం బంగారం లేదు.. ఇలా ఇచ్చిన అనేక హామీలు అమలు చేయలేక అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడన్నారు.
ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ని ఎవరైతే విమర్శిస్తున్నారో వారిని అరెస్టు చేయడమే రెండో పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. పాలన మొత్తం గాలికి వదిలేసి ప్రజల సంక్షేమం విస్మరించిన దౌర్భగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాన్ని ,రేవంత్ రెడ్డి ని కేటీఆర్ నిత్యం వెంటాడుతున్నాడన్నారు. అందులో భాగంగానే ఎలాగైనా కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి,ఇబ్బంది పెట్టాలి,జైల్లో వేయాలి అని రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ పై కుట్రలు చేసి అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారన్నారు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి అనుకుంటే కేటీఆర్ వెంట అడ్వకేట్ లను అనుమతించాలని కోరారు.అడిగితే ,ప్రశిస్తే జైల్లో వేయండి అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా నిన్ను ఎవరు గుర్తించటం లేదు.. అందుకే నీ పేరు ఎవరికి గుర్తు ఉండటం లేదు.. ఇందులో ప్రజల తప్పేం లేదు అన్నారు. మంచి పనులు,పేదలకు సాయం చేస్తే ప్రజల్లో గుర్తు ఉంటారు కానీ పేదల ఇల్లు కులగొడితే ఉండరన్నారు.