- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి.. స్వాగతించిన బీసీ సంఘం
దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంఘ సంస్కర్త సావిత్రి బాయి పులే జయంతి రోజైన జనవరి 3వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో నెంబర్ 9 ను విడుదల చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇది బీసీల పోరాట విజయంగా బావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల ఆకాంక్షలను గౌరవించి సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప నిర్ణయమని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బిసిల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. శుక్రవారం రోజు హైదరాబాద్ రవీంద్ర భారతి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూలే జయంతి కార్యకార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వాహిస్తున్నామని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.