- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్థల విషయంలో తలెత్తిన వివాదం…కట్టర్‌తో దాడి
దిశ, చార్మినార్ : కోర్టులో పెండింగ్ ఉన్న స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో ఓ బీజేపీ నాయకుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ గురువారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో శానిటరీ సామగ్రి కోసం సప్తగిరి శానిటరీ దుకాణానికి వెళ్ళాడు. తమ స్థలంలోకి అక్రమంగా సయ్యద్, మురళీ కృష్ణ, దేశం నరేష్, సిహెచ్ ప్రశాంత్, సి.రవి అనే వ్యక్తులు చొరబడ్డారని పొన్న వెంకటరమణకు సోదరుడు జితేందర్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పొన్న వెంకటరమణ ఘటనా స్థలికి చేరుకుని వీడియో తీస్తుండగా సయ్యద్ , మురళీ కృష్ణ అనే వ్యక్తులు కటర్ ద్వారా గేటుకు ఉన్న రెండు తాళాలు పగుల కొట్టి , లోపల ఉన్న డివిఆర్ బాక్స్‌ను దొంగిలించారు.
ఆ స్థలంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీంతో అయ్యప్ప మాలధారణలో ఉన్న పొన్న వెంకటరమణ అడ్డుకోవడానికి ప్రయత్నించగా సయ్యద్, మురళీ కృష్ణలు రెండు ఫీట్ల కటర్ తో దాడి చేశారు. విజయలక్ష్మి తో పాటు ఆమె కూతురు మరో 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడిచేయడానికి యత్నించడంతో పొన్న వెంకటరమణ డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఇది రెండోసారి తన స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తనపై దాడికి యత్నించారని, విజయలక్ష్మి కుటుంబంతో తమకు ప్రాణ హాని ఉందని, కాగా ఈ స్థల వివాదం కోర్టులో ఉండగానే విజయలక్ష్మి కుటుంబ సభ్యులు రెండవ సారి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తమపై దాడికి యత్నించారని బీజేపీ సీనియర్ నాయకులు పొన్న వెంకటరమణ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు పొన్న వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఛత్రినాక ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మను సంప్రదించగా రెండు గ్రూపుల మధ్య స్థలవివాదం నెలకొందని, ఈ స్థల వివాదం కోర్టులో పెండిగ్ ఉందన్నారు. పొన్న వెంకటరమణ , డి.కృష్ణ లు గురువారం పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు లు చేసుకున్నారని, ఆ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపారు.