Axar Patel : డీసీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. కో-ఓనర్ పార్త్ జిందాల్ హింట్

by Sathputhe Rajesh |
Axar Patel : డీసీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. కో-ఓనర్ పార్త్ జిందాల్ హింట్
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జోరందుకుంది. ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ల పేర్లు ఈ రేస్‌లో ప్రముఖంగా వినిపించాయి. ఈ స్టార్ ఆటగాళ్లను కాదని ఆ జట్టు కో-ఓనర్ పార్త్ జిందాల్ కొత్త పేరును ప్రతిపాదించారు. ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను ఈ సారి వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.27కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి ఢిల్లీ రూ.14 కోట్ల వెచ్చించి కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది. రాహుల్‌తో పాటు డుప్లెసిస్‌ను రూ.2కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యత ఇవ్వడం పక్కా అని అంతా ఒక అంచనాకు వచ్చేశారు. కానీ ఢిల్లీ జట్టు కో-ఓనర్ పార్త్ జిందాల్ మాత్రం అక్షర్ పటేల్ జట్టుతో చాలా ఏళ్లుగా ఉన్నాడని గుర్తు చేశారు. గతంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడని తెలిపాడు. అక్షర్ పటేల్‌కే కెప్టెన్సీ దక్కుతుందా లేదా ఇంకెవరికైనా ఆ చాన్స్ వస్తుందా ఇప్పుడే చెప్పలేమన్నాడు. మేనేజ్‌మెంట్ జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కెప్టెన్‌ను ఎంపిక చేయడానికి ఇంకా సమయం చాలా ఉంది. కేఎల్ రాహుల్ నిలకడ ప్రదర్శనలతోనే ఆయనను దక్కించుకున్నట్లు తెలిపారు. బ్యాటింగ్‌ విభాగంలో రాహుల్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం. కఠినమైన పిచ్‌లపై కూడా రాహుల్ రాణించగలడన్నారు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను రూ.16.5కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. గతంలో డీసీకి కెప్టెన్లుగా వ్యవహరించిన పంత్, శ్రేయస్ అయ్యర్‌లను ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలని ఢిల్లీ భావించింది. కానీ వేలంలో లక్నో, పంజాబ్‌లు ఈ ఇద్దరు ప్లేయర్లను భారీ ధరకు సొంతం చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed