Lalith modi : IPL వేలంలో ఫిక్సింగ్.. మరో బాంబు పేల్చిన లలిత్ మోడీ

by Sathputhe Rajesh |
Lalith modi : IPL వేలంలో ఫిక్సింగ్.. మరో బాంబు పేల్చిన లలిత్ మోడీ
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ సంచలన ఆరోపణలు చేశారు. లలిత్ మోడీ బుధవారం ఓ యూట్యూబ్ షో‌లో మాట్లాడారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యా్చ్‌ల సందర్భంగా ఆ రాష్ట్రానికే చెందిన అంపైర్లను శ్రీనివాసన్ నియమించే వారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎల్‌‌ను శ్రీనివాసన్ ఇష్టపడేవాడు కాదన్నారు. ఐపీఎల్ వర్క్‌ఔట్ అవుతుందని తొలుత ఆయన భావించలేదని.. అయినా లీగ్‌కు భారీగా రెస్పా్న్స్ వచ్చిందన్నాడు. బీసీసీఐకి సెక్రటరీగా ఉన్నప్పుడు శ్రీనివాసన్‌ను అనేక అంశాల్లో వ్యతిరేకించినట్లు ఆయన తెలిపాడు. అందుకే శ్రీనివాసన్ తనను విరోధిలా చూసేవాడన్నాడు. చెన్నై మ్యాచ్‌లకు చెన్నై అంపైర్లను నియమించడాన్ని ఫిక్సింగ్ అని భావించి వాటిని బయటపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. అందుకే శ్రీనివాసన్ తనను పూర్తిగా వ్యతిరేకించినట్లు గుర్తు చేశాడు.

‘ఫ్లింటాఫ్ కోసం బిడ్ వేయొద్దు..’

2009 ఐపీఎల్ సీజన్ వేలం సందర్భంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోసం ఏ ఫ్రాంచైజీ బిడ్ వేయకుండా శ్రీనివాసన్ ఫిక్సింగ్ చేశారని లలిత్ మోడీ ఆరోపించారు. ఫ్లింటాప్‌ శ్రీనివాసన్‌కు దక్కే వ్యవహారాన్ని తానే దగ్గరుండి చక్కబెట్టానన్నారు. ఐపీఎల్ నిర్వహణకు శ్రీనివాసన్ ప్రతిబందకంగా మారినట్లు తెలిపాడు. ఫ్లింటాఫ్ కోసం ఎవరూ బిడ్ వేయవద్దని మేమే అన్ని ఫ్రాంచైజీలకు చెప్పినట్లు లలిత్ మోడీ వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed