Game Changer: ఇదేం అభిమానం రా అయ్యా? రామ్ చరణ్ ఫ్లెక్సీకి రక్త తిలకం.. బ్లేడుతో కోసుకుని మరీ..

by Prasanna |   ( Updated:2025-01-10 06:52:51.0  )
Game Changer: ఇదేం అభిమానం రా అయ్యా? రామ్ చరణ్ ఫ్లెక్సీకి రక్త తిలకం.. బ్లేడుతో కోసుకుని మరీ..
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన మూవీ "గేమ్ ఛేంజర్" మూవీ నేడు ( Game Changer) థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక, మెగా అభిమానుల హడావుడి మాములుగా లేదు. అయితే, అనంతపురంలో ఓ వీరాభిమాని చేసిన పనికి షాక్ అవ్వకుండా ఉండలేరు. అతను అంతలా ఏమి చేసి ఉంటాడని సందేహిస్తున్నారా.. ?

"గేమ్ ఛేంజర్" విడుదల సందర్భంగా ఓ అభిమాని తన చేయిని బ్లేడుతో కట్ చేసుకుని మరీ చిరంజీవి , పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దుతూ జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. అక్కడున్న వారు, వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో . నెట్టింట హల్చల్ చేస్తుంది. అభిమానం ఉండాలి .. మరి ఇలా కాదు? మెగా హీరోలకు ఇలాంటి పనులు అసలు నచ్చవంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి నటీ నటులు నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. థమన్ సంగీతాన్ని అందించాడు.

Advertisement

Next Story

Most Viewed