kidney stones: ఈ ఐదు రకాల కూరగాయలు తింటున్నారా.. మూత్రపిండాల్లో..

by Anjali |
kidney stones: ఈ ఐదు రకాల కూరగాయలు తింటున్నారా.. మూత్రపిండాల్లో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో జనాలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవన శైలిలో మార్పులు మనిషిని ఆసుపత్రులు చుట్టూ తిరిగిస్తున్నాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్య గురించి తెలిసిందే. చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. కిడ్నీల్లో స్టోన్స్ వస్తే భరించలేనంతగా నొప్పి ఉంటుంది. కాగా మూత్రపిండా(kidney)ల్లో రాళ్ల రాకుండా ఉండాలంటే రోజులో తగినంత వాటర్ తాగాలని వైద్యులు సూచిస్తూనే ఉంటారు. అయితే నీటితో పాటు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో స్టోన్స్ ప్రమాదాన్ని పెంచే పలు కూరగాయల్ని తినకూడదని చెబుతున్నారు. తింటే మూత్రపిండాల్లో రాళ్ల బాధను పెంచుతుందని అంటున్నారు. మరీ ఏఏ కూరగాయలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర..

పాలకూల ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర(Lettuce)లో ఆక్సలేట్ పరిమాణం(Amount of oxalate) అధికంగా ఉంటుంది. కాగా కిడ్నీలో స్టోన్స్ రావడానికి పాలకూడా కారణం అవుతుంది. ఆల్రేడీ స్టోన్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నవారు తక్కువగా తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.

టమాటా అండ్ వంకాయ..

వీటిలో కూడా ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), ఫైబర్(Fiber) వంటి అనేక రకాల విటమిన్లు అధికంగా ఉన్నప్పటికీ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బంగాళా దుంపలు, కీరా దోసకాయ..

వాస్తవానికి దోసకాయ(Cucumber) తినడం హెల్త్ కు చాలా మంచిది. కానీ దోసలోని విత్తనాల్లో ఆక్సలేట్ సేంద్రీయ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. కాగా అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికే నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బంగాళా దుంపల్ని కూడా తక్కువగా తినడం మేలని వెల్లడిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed