- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Djokovic : రిటైర్మెంట్‌పై స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : తాను రిట్మైర్మెంట్‌కు సిద్ధంగా లేనని.. అయితే మా నాన్న మాత్రం నేను టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు స్టార్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ తెలిపాడు. ఈ మేరకు వివరాలను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ శుక్రవారం వెల్లడించింది. ‘గత కొన్ని రోజులుగా మా నాన్న నేను వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తున్నాడు. ఆటలో ఉండే ఒత్తిడి గురించి ఆయనకు తెలుసు. నా ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం ఉంటుందని ఆయన భావిస్తున్నాడు. అందుకే నాన్న నేను ఎలా ముగింపు పలుకుతానని ఆలోచించడం ప్రారంభించాడు. నేను ఈ విషయంలో సంశయంలో పడ్డాను. మరిన్ని మ్యాచ్‌ల్లో నేను ఓడిపోతే గ్రాండ్‌స్లామ్‌ల్లో ఇబ్బందులు తప్పవు. అప్పుడు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుందని భావిస్తున్నా.. కానీ ప్రస్తుతం నేను ఆటలో కొనసాగుతా..’ అని జకోవిచ్ అన్నాడు. జకోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లు ఇప్పటికే గెలుచుకున్నాడు. వంద వరకు ఏటీపీ టూర్ టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ తొలి మ్యాచ్‌లో జకోవిచ్ యూఎస్‌కు చెందిన నిశేష్ బసవరెడ్డితో ఆదివారం తన తొలి రౌండ్‌లో తలపడనున్నాడు.