మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. స్పెషల్ పోస్టర్‌తో మరింత క్యూరియాసిటీ పెంచేశారుగా

by Kavitha |   ( Updated:2025-03-25 07:06:00.0  )
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. స్పెషల్ పోస్టర్‌తో మరింత క్యూరియాసిటీ పెంచేశారుగా
X

దిశ, వెబ్‌డెస్క్: నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin) కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్-2’(Mad-2). ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా. ఇక కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య(Sai Sowjanya), సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ మార్చి 28న విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ మ్యాడ్ స్క్వేర్ మూవీ ట్రైలర్ ఈరోజు రాబోతున్నట్లు వెల్లడించారు. కానీ టైం మాత్రం చెప్పలేదు.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్‌తో పాటు మరికొందరు యాక్టర్స్ కూడా ఉన్నారు. అలాగే యంగ్ బ్యూటీ ప్రియాంక జువాల్కర్ కూడా స్పెషల్ పోస్టర్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు పోస్టర్‌తో మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచేశారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Next Story

Most Viewed