మరోసారి సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
మరోసారి సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో వివాదాస్పద నేతగా పేరు ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి సొంత పార్టీపై విమర్శలు (Criticism of own party) చేశారు. బీజేపీ పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని, కొంతమంది నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని, తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడి యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ఎన్నిక సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) వరుసగా చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవి నికార్సైన నేతలకు ఇవ్వాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యేవారికి ఇవ్వవద్దని అన్నారు. తన కోసం పనిచేసే వారికి కాకుండా.. పార్టీ, కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ (bjp) తప్పకుండా అధికారంలోకి వస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Advertisement
Next Story