- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంగన్‌వాడీల్లో ఇష్టారాజ్యం..?

దిశ, తాండూర్ పట్టణం: అంగన్వాడీ కేంద్రాలను సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ప్రతిరోజూ అంగన్వాడీ టీ చర్లు కొందరు తమ విధులు పూర్తయిన అనంతరం సరుకులు తీసుకువెళ్తున్నారని బలమైన ఆధారాలున్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్క అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పై అధికారులు పట్టుకోలేకపోయారు. ఇదంతా మామూలుగా కొనసాగుతున్నదని వినికిడి. దానికి తోడు అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసే బియ్యం బస్తాలు నాణ్యత లేకుండా ఉన్నాయి. 50 కిలోలు ఉండవలసిన బస్తాకు 5,6 కిలోలు తక్కువగా తూకం ఉందని అంగన్వాడీ టీచర్లే చెప్తున్నారు. రెండు నెలల క్రితం 15 కిలో లకు పైగా బియ్యం తక్కువ తూకం వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల కోసం, గర్భిణుల కోసం ఎన్నో రకాల పోషకాలున్న ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తుంటే పై అధికారుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు వ్యర్థంగా మారిపోతున్నాయి. ఏ ఒక్క అం గన్వాడీ కేంద్రంలో కూడా మెనూ ప్రకారం చిన్నారులకు, గర్భిణులకు ఆహార పదార్థాలు అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గత నెల క్రితం ఓ అంగన్వాడీ కేంద్రంలో పప్పులో పురుగులు వచ్చాయని అంగన్వాడీ టీచర్ తెలిపారు. అంగన్వాడీకేంద్రాలపై పర్యవేక్షించే సూపర్వైజర్లు, సీడీపీవోల నియంత్రణ లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రానికి లేటుగా వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం 50శాతం పైగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయని పలువరు పేర్కొంటున్నారు. పై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా పట్టించుకొని అంగన్వాడీ కేంద్రాలు సజావుగా కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.