Pawan Kalyan: గురువు మృతిపై స్పందించిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్.. ఆయన సేవలు మరువలేనివంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2025-03-25 07:05:24.0  )
Pawan Kalyan: గురువు మృతిపై స్పందించిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్.. ఆయన సేవలు మరువలేనివంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan) గురువు షిహాన్ హుసైని(Shihan Hussaini) మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు షిహాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒకప్పుడు షిహాన్, పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా, షిహాన్ మరణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ‘‘ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు శ్రీ షిహాన్ హుస్సైనీ గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 3 వేల మందికి పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించడమే కాకుండా, తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.

Read More..

సీనియర్ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు కన్నుమూత

Advertisement
Next Story

Most Viewed