వెటర్నరీ డాక్టర్ లేక మూగ జీవులకు అందని వైద్యం..

by Aamani |
వెటర్నరీ డాక్టర్ లేక మూగ జీవులకు అందని  వైద్యం..
X

దిశ, ఏన్కూర్ : పశు సంపద పెంచాలి. గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి ను పెంచడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది, అని చెబుతున్న అధికారులు, మండలం లోని జన్నారం, అరికాయలపాడు,బురదరగపురం, గ్రామాల్లో ఉన్న పశువైద్యశాలకు వెటర్నరీ డాక్టర్ లేక మూగజీవాలు వ్యాధులు సోకితే వైద్యం అందించిన నాథుడు కరువయ్యారు. ప్రధానంగా ఏనుకూరు మండలం లో గొర్రెలు మేకలు, తెల్ల పశువులు, బర్రెలు, సుమారు పదివేల వరకు ఉంటాయని అంచనా. గ్రామాల్లో గోపాల మిత్రుల ద్వారా వైద్యం అందడామే తప్ప వైద్యులు లేరు.

లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం గ్రామాలలో పశువైద్యశాల ఏర్పాటు చేస్తే, వెటర్నరీ డాక్టర్ లేకపోవడం వల్ల ఇక్కడ అటెండర్లు డాక్టర్ల అవతారం ఎత్తవలసి పరిస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధులు సోకిన సందర్భంలో ఆయా గ్రామాల్లో మూగ జీవాలకు వైద్యం అందించడం కష్టతరంగా మారుతుంది. పశు సంపద పెరగాలి , పాల ఉత్పత్తులు కూడా గణనీయంగా పెంచాలని అధికారులు చెబుతున్నారు తప్ప, వాటికి రోగాలు వస్తే నివారించడానికి వైద్యం అందించడానికి వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో లేరు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే ఆయా పశువైద్యశాలకు వెటర్నరీ డాక్టర్ నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు,రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed