- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ఇందులో మీరు ఏ మూవీకి వెళ్తారు..

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ వచ్చేసింది. ఈ ఎండలకు కూల్ కూల్‌గా థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా న్యూ మూవీస్ విడుదల కానున్నాయి. మరి ఆ సినిమా లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎల్2: ఎంపురాన్:(L2: Empuran)
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎల్2: ఎంపురాన్’(L2: Empuran). పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది. లైకా ప్రొడక్షన్స్, ఆశిర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఇక ఈ మూవీ మార్చి 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
వీర ధీర శూరన్-2:(Veera Dheera Sooran-2)
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2). అరుణ్ కుమార్(Arun Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటిస్తోంది. హెచ్‌ఆర్ పిక్చరకస్ బ్యానర్ పై రియాశిబు(Ria Shibu) నిర్మిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్(Gv Prakash Kumar) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో రాబోతోంది.
రాబిన్ హుడ్:(RobinHood)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
మ్యాడ్ స్వ్కేర్:(MAD-2)
నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin) కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్-2’(Mad-2). కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య(Sai Sowjanya), సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ మార్చి 28న విడుదల కాబోతుంది.
సికిందర్:(Sikindar)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సికిందర్'(Sikindar). ఎఆర్ మురుగదాస్(AR Muragadas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తున్నారు. కాగా ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Read More..
‘కన్నప్ప’ నుంచి బిగ్ బాస్ విన్నర్ పోస్టర్ రిలీజ్.. కుమారదేవ శాస్త్రి ఫస్ట్ లుక్ రిలీజ్(పోస్ట్)