ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లకు మరో యువకుడు బలి

by Naveena |   ( Updated:2025-03-25 08:41:06.0  )
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లకు మరో యువకుడు బలి
X

దిశ,మేడ్చల్ టౌన్ : క్రికెట్ బెట్టింగుకు పాల్పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామానికి జీవనోపాధి నిమిత్తం కొద్ది సంవత్సరాల క్రితం వచ్చారు. రమణ దంపతులకు కుమారుడు సోమేశ్ (29) తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం అయింది. సోమేశ్ బెట్టింగ్ కు పాల్పడుతూ ఉండేవాడు. గతంలో కూడా సోమేశ్ బెట్టింగ్ పాల్పడి అప్పుల పాలయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బెట్టింగ్ పాల్పడిన డబ్బులను కట్టి సోమేశ్ ను ఇంకోసారి చేయవద్దని మందలించారు.

సోమేశ్ దేవరయంజాల్ పరిధిలోని గోదాంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. గోదాంకు సంబంధించిన డబ్బులు లక్ష రూపాయలు తన వద్ద ఉండడంతో.. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ కు పెట్టాడు. దురదృష్టవశాత్తు సోమేశ్ బెట్టింగ్ లో డబ్బులను పోగొట్టుకున్నాడు. గోదాంకు సంబంధించిన డబ్బులు ఉదయం గోదాంలో చెల్లించాల్సి ఉంది. బెట్టింగులో డబ్బులు పోగొట్టుకోవడంతో.. డబ్బులు గోదాంలో ఎలా చెల్లించాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా బెట్టింగులకు పాల్పడి యువత బలవన్మరణానికి పాల్పడడం భయాందోళనకు గురి చేస్తుంది.

Advertisement
Next Story