- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
INC: ఆ బ్యాగు చూసి కేటీఆర్ తెల్లమొహం వేశాడా..? బీఆర్ఎస్కు టీ కాంగ్రెస్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: ఆ నల్ల బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నడా కేటిఆర్(KTR)! అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును ఉద్దేశించి "ఏసీబీ ఆఫీసులో(ACB Office) ఈ నల్ల బ్యాగు ఉంది, ఎవరిదో చెప్పుకోండి.." అని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చేసిన ట్వీట్ కి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా.. ఆ నల్ల బ్యాగులో 2014 నుండి మీరు చేసిన పాపాల చిట్టా ఉందని అన్నది.
ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం, ఔటర్ రింగు రోడ్డు దోపిడీ, కాళేశ్వరం స్కాం, అక్రమ ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు, కవిత లిక్కర్ స్కాం, ధరణీ పోర్టల్ తో చేసిన భూ దోపిడీ, స్కీంల వంకతో చేసిన స్కాంలు, గొర్రెల స్కాం, సర్పంచ్ లకు ఎగ్గొట్టిన బిల్లులు, మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుల వివరాలు, దళితుల పై మీరు చేసిన దౌర్జన్యాలు.. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నది. అంతేగాక మీ బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ ఒక్క బ్యాగు సరిపోదని, ఇంకా చాలా బ్యాగులను నింపాల్సి ఉందని ఎద్దేవా చేసింది. కేటీఆర్ విచారణకు వెళ్ళిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి అని తెలంగాణ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.