Ravichandran Ashwin: హిందీ జాతీయ భాష కాదు.. క్రికెటర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-10 06:15:49.0  )
Ravichandran Ashwin: హిందీ జాతీయ భాష కాదు.. క్రికెటర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ (Hindi) మన జాతీయ భాష కాదని ఇటీవలే భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి కాంచీపురం (Kanchipuram)లోని రాజలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల (Raja Lakshmi Engineering College)లో గ్రాడ్యుయేషన్‌ డే (Graduation Day) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, తాను ప్రసంగించే ముందు ఏ భాషలో మాట్లాడాలని కార్యక్రమానికి వచ్చిన వారిని అశ్విన్ ప్రశ్నించారు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలా అని అడగ్గా అందురూ చప్పట్లు కొట్టారు.

తమిళంలో మాట్లాడాలా అని ప్రశ్నించగా అందరూ ఒక్క బిగ్గరగా అరిచారు. ఇక హిందీ అనగానే ప్రేక్షకులంతా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే అశ్విన్ (Ashwin) మాట్లాడుతూ.. హిందీ మన జాతీయ భాష కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ కేవలం ఓ అధికారిక భాష మాత్రమే అని తెలిపారు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ కాలం పాటు తాను ఇంగ్లీష్, హిందీ మాత్రమే మాట్లాడేవాడినని తెలిపారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని వారాల వ్యవధిలోనే అశ్విన్ ఇలా హిందీ భాష (Hindi Language)పై కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed