- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trending: వామ్మో రూ.210 కోట్ల కరెంట్ బిల్లు.. గుడ్లు తేలేసిన వ్యాపారి
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉండే ఇళ్లలో నెలకు కరెంట్ బిల్లు మహా అయితే రూ.500 లేదా రూ.వెయ్యి వస్తుంటుంది. కమర్షియల్ (Commercial) విద్యుత్ వినియోగదారులకు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు లేదా అంతకు మించి బిల్లు వస్తుంది. కానీ, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. హమీర్పుర్ (Hamirpur) జిల్లా జట్టాన్ (Jattaan) గ్రామానికి చెందిన వ్యాపారి లలిత్ ధిమాన్ (Lalith Dhimaan) కు అక్షరాల రూ.2,10,42,08,405 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో అది చూసిన లలిత్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అంతకు ముందు నెల తనకు కరెంట్ బిల్లు రూ.2,500 మాత్రమే వచ్చిందని లోకల్ విద్యుత్ అధికారులతో వాగ్వాదనికి దిగాడు. ఒక్కసారిగా తనకు రూ.210 కోట్ల కరెంట్ బిల్లు రావడం పట్ల లలిత్, విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం వారు మీటర్ రీడింగ్ (Meter Reading), బిల్ జనరేట్ (Bill Generate) చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. దీంతో లలిత్ ధిమాన్ తాను రూ.210 కోట్లు కట్టనక్కర్లేదంటూ ఊపిరి పీల్చుకున్నాడు.