TPCC: తిరుమలకు టీపీసీసీ చీఫ్.. ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

by Ramesh Goud |
TPCC: తిరుమలకు టీపీసీసీ చీఫ్.. ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల(Thirumala)కు వెళ్లిన ఆయన.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారా దర్శనంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ధనుర్మాస ఏకాదశి అని, తెలంగాణ ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని మహేష్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed