‘నన్ను బతికించడం కోసమే పెళ్లి చేసుకుంది’.. ఏడ్చుకుంటూ భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్(వీడియో)

by Kavitha |
‘నన్ను బతికించడం కోసమే పెళ్లి చేసుకుంది’..  ఏడ్చుకుంటూ భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్(వీడియో)
X

దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షో వల్ల చాలా మంది పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో కమెడియన్ రోల్ ప్లే చేసిన వారు ఉన్నారు. అలా ఫేమస్ అయిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. ఆయన స్కిట్‌లో అడుగుపెట్టాడంటే చాలు వరుసగా పంచ్‌లు పడుతునే ఉంటాయి. ఆటో రామ్ ప్రసాద్‌కు కూడా తన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసే స్టామినా అతనికి ఉంది. అయితే పంచ్ ప్రసాద్ ఎంత నవ్వించేవాడో అంత విషాదం అతని వెనక ఉంది. అనారోగ్యం అతనికి నిద్ర లేకుండా చేసింది. స్టేజ్ మీద నవ్విస్తున్నా.. తెరవెనుక మాత్రం అతని బాధ వర్ణనాతీతం. రెండు కిడ్నీలు చెడిపోయి.. డయాలసీస్ మీద బ్రతికాడు చాలా కాలం. అది కూడా సరిపోక.. నడవలేక, నొప్పి భరించలేక చాలా ఇబ్బంది పడ్డాడు.

అలా అనారోగ్యంతో ఉన్న తన భర్తకి తన కిడ్నీని ఇచ్చి ఆదుకుంది. ప్రస్తుతం ప్రసాద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ షోస్‌లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు ఫ్యామిలీతో పాటు పంచ్ ప్రసాద్ కూడా వచ్చారు. అయితే ఆ ప్రోగ్రామ్‌లో ప్రసాద్ తన భార్య గురించి మాట్లాడుతూ .. ‘ప్రేమించుకున్న వాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ, నా భార్య నన్ను బతికించడానికే పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు.

మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా.. నేను అదే చేయాలనుకుంటున్నాను’ అని అన్నాడు. ఇక అలా అనడమే ఆలస్యం.. భార్యను కూర్చోపెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసిన ప్రసాద్ భార్య సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్ళాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed