AE Certificate Verification: రేపే అసిస్టెంట్ ఇంజినీర్ సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-27 17:40:01.0  )
AE Certificate Verification: రేపే అసిస్టెంట్ ఇంజినీర్ సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్ విభాగం(Engineering Department)లోని ఖాళీల భర్తీకి సెకండ్ ఫేజ్(Second phase) సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate Verification)ను గురువారం నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ(TGPSC Secretary) నవీన్ నికోలస్(Naveen Nicholas) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఇంజినీర్(AE), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్(MAE), టెక్నికల్ ఇంజినీర్(TE), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్(JTO)కు సంబంధించిన ధ్రువపత్రాల పరీశీలన నాంపల్లి(Nampally)లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను http://www.tgpsc.gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు గైర్హాజరైన అభ్యర్థులు, పెండింగ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అభ్యర్థులకు 29వ తేదీన వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed