- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGSET-2024: టీజీ సెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పటినుంచంటే..!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అస్సిటెంట్ ప్రొఫెసర్(Assistant Professor), డిగ్రీ లెక్చరర్(Degree Lecturer) నియామకాల అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా టీజీ సెట్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TGSET-2024) ఫలితాలను ఇటీవల ప్రకటించారు. పరీక్ష ఫలితాల్లో మొత్తం 1,884 మంది అర్హత సాధించారు. అయితే క్వాలిఫై అయినా అభ్యర్థుల ధ్రువపత్రాల పరీశీలన(Certificates Verification) తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం(OU) షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. ఓయూ క్యాంపస్(OU Campus)లోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్(Distance Education Centre) నందు ధ్రువపత్రాల పరీశీలన ఉంటుందని తెలిపింది.
సర్టిఫికట్ వెరిఫికేషన్ కు కావాల్సినవి..
- టీజీ సెట్-2024 స్కోర్ కార్డు
- 10Th క్లాస్ ఒరిజినల్ మెమో
- పీజీ మార్కుల లిస్ట్
- ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్
- ఇన్ కమ్ సర్టిఫికెట్
- దివ్యంగా అభ్యర్థులైతే సంబంధిత సర్టిఫికెట్
- ఈడబ్ల్యూఎస్ కోటా వారైతే సంబంధిత సర్టిఫికెట్
- టూ సెట్స్ జిరాక్స్ కాపీస్