ఆ ఆడియో వెనక బీఆర్ఎస్: ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

by srinivas |
ఆ ఆడియో వెనక బీఆర్ఎస్: ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన ఆడియోను వక్రీకరించి వైరల్ చేస్తున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ప్రధానంగా దీని వెనకాల బీఆర్ఎస్ పాత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన కల్వ సుజాత, లింగం యాదవ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. పేరున్న మీడియా సంస్థలు కూడా ఆ ఆడియోను ప్లే చేస్తున్నాయని పేర్కొన్నారు. తాగునీటి సమస్య గురించి తమకు మామిడి మహేష్ అనే వ్యక్తి ఓకరు ఫోన్ చేశారని తెలిపారు. జాబ్‌పై మాట్లాడిన అంశాన్ని మరొక అంశానికి జోడించి ఆడియో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మనం ముందే ఎలా చెప్తామని తాను తెలిపానని, దానిని మరోకరకంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. దీని వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందని దుయ్యబట్టారు. ముక్కు సూటిగా మాట్లాడం తనకు అలవాటు... దానికి ఇంత రాద్దాంతం ఎందుకు? ఆయన ప్రశ్నించారు. తాను ఎవ్వరికీ భయపడను... ఆడియో వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.



Next Story

Most Viewed