- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sabal 20 : భారత ఆర్మీ చేతికి ‘సబల్ 20’
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ‘సబల్ 20’(Sabal 20) అనే మానవరహిత ఎలక్ట్రిక్ హెలికాప్టర్(Unmanned Helicopter) భారత ఆర్మీ(Indian Army)కి అందుబాటులోకి వచ్చింది. కొండలు, లోయలు, అడవులు ఉన్న ప్రాంతాలకు సైనిక సామగ్రి, పేలుడు పదార్థాలు, ఆయుధాల తరలింపు అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. 20 కేజీల వరకు పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఎండ్యూర్ ఎయిర్’ కంపెనీ ‘సబల్ 20’ని తయారు చేసింది. శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంత ఎత్తు నుంచి ఎగిరే కెపాసిటీ దీని సొంతం. ఈ హెలికాప్టర్ రెక్కలు తిరిగే వేగం చాలా తక్కువ. దీనివల్ల ప్రయాణ సమయంలో సబల్ 20 నుంచి తక్కువ శబ్దం వెలువడుతుంది. ఎత్తులో ఎగరడం, శబ్దం తక్కువగా ఉండటంతో శత్రువులు దీన్ని గుర్తించే అవకాశాలు తగ్గుతాయి.
Advertisement
Next Story