ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు

by Sridhar Babu |   ( Updated:2024-11-27 15:41:18.0  )
ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు
X

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన గాదె లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకుల రాజేశ్వరరావు, పొలాడి రామచంద్రరావు, పొలాడి రత్న షీలా అనే ముగ్గురిపైన బుధవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం 2015 వ సంవత్సరంలో గాదె లక్ష్మణ్ కు రెండు ఎకరాల భూమి పట్టా చేయిస్తామని అతని వద్ద వరుసకు బావ అయినటువంటి రాజేశ్వరరావు రూ.8 లక్షలు తీసుకున్నాడు.

అనంతరం పొలాడి రామచంద్రరావు, పొలాడి రత్నషీలతో కుమ్మక్కై ఆ భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేయించారు. బాధితుడైన లక్ష్మణ్ ఇచ్చిన అడ్వాన్స్​ డబ్బులు ఇవ్వకపోగా భూమి పట్టా చేయకుండా మోసం చేశారు. డబ్బులు తీసుకొని మోసం చేసినందుకు గాదె లక్ష్మణ్​ ఫిర్యాదు మేరకు పై ముగ్గురు నిందితులపైన చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.

Advertisement

Next Story