- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అశ్విన్‌తో బౌలింగ్ చేయించడం ఆపండి.. సీఎస్కేకే భారత మాజీ క్రికెటర్ సూచన

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో ముంబైపై గెలుపుతో లీగ్‌లో శుభారంభం చేసిన చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. బెంగళూరు, రాజస్థాన్ చేతుల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సీఎస్కేకు పలు సూచనలు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. అశ్విన్‌తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించొద్దని, 7-18 ఓవర్ల మధ్య అతనికి బౌలింగ్ ఇవ్వాలని సూచించాడు. ‘జేమీ ఓవర్టన్ స్థానంలో డెవాన్ కాన్వేను తిరిగి తీసుకరండి. రాహుల్ త్రిపాఠిని తప్పించి అన్షుల్ కాంబోజ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోండి. కానీ, పవర్ ప్లేలో అతనితో బౌలింగ్ చేయడం ఆపండి. 7-18 ఓవర్ల మధ్య జడేజా, నూర్ అహ్మద్‌లతో కలిసి అశ్విన్ ప్రభావం చూపగలడు. అలాగే, శివమ్ దూబె తుది జట్టులో ఉండాలి. ఆండ్రీ సిద్ధార్థ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలి. పేసర్ ముకేశ్ చౌదరి కూడా మంచి ఆప్షన్. గతంలో సీఎస్కే తరపున ఆకట్టుకున్నాడు.’ అని శ్రీకాంత్ సూచనలు చేశాడు. చెన్నయ్ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.