- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BVR Mohan Reddy: సైయెంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి గోల్డెన్ పీకాక్ అవార్డు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ లిమిటెడ్ (Cyient Ltd) వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి(BVR Mohan Reddy)కి ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారం లభించింది. టెక్నాలజీ(Technology), ఇంజనీరింగ్(Engineering) రంగాలలో ఆయన అందించిన సేవలకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) అతన్ని గోల్డెన్ పీకాక్(Golden Peacock) అవార్డుతో సత్కరించింది. ఇటీవల లండన్(London)లో జరిగిన ఐవోడీ వార్షిక సమావేశం(Annual Meeting)లో ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్(VC), మేనేజింగ్ డైరెక్టర్(MD) బొదనపు కృష్ణ(Bodhanapu Krishna) స్పందిస్తూ.. మోహన్ రెడ్డి దూరదృష్టి, ప్రత్యేకమైన ప్రణాళిక, పట్టుదల కారణంగానే సైయెంట్ లిమిటెడ్ టాప్ ఐటీ సర్వీసెస్ కంపెనీగా ఎదిగిందని తెలిపారు. కాగా మోహన్ రెడ్డి గతంలో నాస్కామ్ ఛైర్మన్(Nasscom Chairman) తో పాటు టీ- హబ్(T-Hub) ఫౌండింగ్ డైరెక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్(IIT Hyd), ఐఐటీ రూర్కీ(IIT Roorkee) బోర్డు ఆఫ్ గవర్నర్స్(BOG)కు ఆయన ఛైర్మన్ గా ఉన్నారు.