- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: మోడీతో పవన్ కల్యాణ్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఢిల్లీలో ప్రధాని మోడీ(Prime Minister Modi)తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి సంబంధించి ఏఏ అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లారనే చర్చ ప్రజల్లో కొనసాగుతుంది. మోడీతో పవన్ భేటీ ముగియడంతో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. మోడీ దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్లిన అంశాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ పథకం(Jal Jeevan Mission Scheme)ను సమర్థంగా అమలు చేస్తామని, సహకరించాలని మోడీని పవన్ కోరినట్లు తెలిపారు. దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం గాలి కొదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని మోడీకి పవన్ తెలిపినట్లు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్‌ను గౌరవ ప్రధాని ఎదుట ఉంచినట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
పవన్ మోడీకి తెలిపిన మరిన్ని అంశాలు ఇవే..
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయించింది. దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వంలో పూర్తయిన పనుల్లో ఏ మాత్రం ప్రయోజనం లేదు. పనుల కోసం ఖర్చు చేసిన నిధులు సైతం పథక లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం అందలేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకొని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్ ను తయారు చేసింది. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించాం. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది మా ఆశయం.’’ అని ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేసినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.