- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను మల్టీ జోన్ -2 ఐజీ సత్యనారాయణ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ జానకి తో కలిసి అమిస్తాపూర్ గ్రామంలోని సభా ప్రాంగణంలోని వేదిక నిర్వాహణ,విఐపీ ల గ్యాలరీ,ప్రాంగణంలో సీసీ కెమరాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విఐపీ ల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు,నిషేధిత ప్రాంతాలను గుర్తించి పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తూ పలు సూచనలు చేశారు. సభకు వచ్చే రైతులు,ప్రజల రాకపోకల సౌకర్యం కోసం ప్రత్యేక ట్రాఫిక్ మార్గదర్శకాలు రూపొందించాలని,వాహనాల పార్కింగ్ ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాల డ్యూటీ చార్టులను స్పష్టంగా కేటాయించాలని,అనుమానితులను ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర సేవల కోసం అంబులెన్స్,ఫైర్ సర్వీసులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు,భూత్పూర్ సిఐ రామకృష్ణ,స్పెషల్ బ్రాంచ్ సిఐ శివకుమార్,తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.