Social skills : సామాజిక సంబంధాలే.. జీవన నైపుణ్యాలు

by Javid Pasha |
Social skills : సామాజిక సంబంధాలే.. జీవన నైపుణ్యాలు
X

దిశ, ఫీచర్స్ : మీరు ఏదో ఒక విషయంలో వెనుక బడి ఉన్నారా? మరో రంగంలో సక్సెస్ ఫుల్ వ్యక్తిగా గుర్తింపు పొందారా?, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒడిదుడుగులు ఎదుర్కొంటున్నారా? మీకున్న సామాజిక సంబంధాలు కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక సమస్యలు, సవాళ్లు, బాధలు, సంతోషాలు, గెలుపోటములు వంటివన్నీ మీలోని సోషల్ ఇంప్రూవ్ మెంట్ స్కిల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయంటున్నాయి. కానీ ప్రస్తుతం అనేది మంది ఇలాంటి సామాజిక సంబంధాలు, నైపుణ్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అనేక అవకాశాలు కోల్పోతున్నారు? ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటే.. సామాజిక నైపుణ్యాలు కూడా కొరవడతాయి. దీనివల్ల వ్యక్తిగత, వృత్తి జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని అధిగించే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. అందుకోసం ముందుగా మీలో సోషల్ కనెక్షన్స్ లేకపోవడానికి కారణాలేమిటో గుర్తించండి.మీరున్న పరిస్థితుల్లో రాణించాలంటే ఎలాంటి సామాజిక సంబంధాలు అవసరమో గమనించండి. అంటే ఇవి ఒక్కో రంగానికి ఒక్కో విధంగా కూడా వర్తిస్తాయి. పబ్లిక్ రిలేషన్ సెక్టార్‌లో ఉంటే ప్రజలతో సంబంధాలు, కార్పొరేట్ సెక్టార్లో అయితే వర్క్ ప్లేస్‌లో సోషల్ కనెక్షన్స్ వంటివి అవసరం అవుతాయి.

ఆందోళన, తిరస్కరణ భయం

సోషల్ స్కిల్స్, నెట్వర్క్ కొరవడటానికి గల ప్రధాన కారణాల్లో వాటి గురించిన అతి ఆందోళన, రిజెక్షన్ భయాలు కూడా కారణం అవుతుంటాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గతంలో కొన్ని రకాల ఇంటరాక్షన్స్ బాధాకరమైన అనుభూతిని కలిగించడంవల్ల కూడా మీలో ఇలాంటి తిరస్కరణ భయాలను, భావాలు నాటుకుపోయి ఉండవచ్చు. దాని కారణంగా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ప్రజలు లేదా తామున్న వర్క్ ప్లేస్‌లోని ఇతర వ్యక్తులను తమను వ్యతిరేకిస్తారని ఆందోళన పడుతుంటారు. కానీ ఇవి మిమ్మల్ని సోషలైజ్డ్ కాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి అధిగమించే ప్రయత్నం తప్పక చేయాలి. మీ చుట్టూ ఉండే వారితో సాధారణ పరిచయాలు మొదలు కొని క్రమంగా సామాజిక జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ప్రజలను, పరిస్థితులను, పరిణామాలను నిశితంగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి ఇందుకు సహాయపడతాయి.

ఇవి కూడా కారణం కావచ్చు

మీలో సామాజిక నైపుణ్యాలు లేదా సంబంధాలు లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా నష్టపోతారు. కాబట్టి వాటిని ఏర్పర్చుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కొందరు తాము పుట్టి పెరిగిన వాతావరణం, దాని వల్ల ఏర్పడిన వ్యక్తిత్వం కారణంగా ఈ సోషల్ కనెక్షన్స్‌కు దూరంగా ఉంటూ ఉండవచ్చు. మరికొందరు సెంటిమెంట్లు, సంప్రదాయాలు, అణచివేతలు, నిబంధనల కారణంగానూ ఈ సమస్యను ఎదుర్కొని ఉండవచ్చు. పలువురు యువతీ యువకులు బాడీ ఇమేజింగ్ గురించిన ప్రతికూల ఆలోచనల్లో కూరుకు పోయి కూడా సామాజిక సంబంధాలకు దూరమవుతుంటారు. కానీ ఇవన్నీ మీ ఎదుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి ధైర్యం చేయండి. మీరు సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఉండాలంటే ఈ విశాలమైన ప్రపంచంలో చాలా తెలుసుకోవాలి. అందుకు సోషల్ కనెక్షన్స్ మాత్రమే మంచి మార్గం.

ఎలా అలవర్చుకోవాలి?

సామాజిక జీవితాన్ని లేదా సంబంధాలను అలవర్చుకోవడం ప్రస్తుత రోజుల్లో చాలా ముఖ్యం. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్‌ను కలిగి ఉండటం కూడా ఇందుకు దోహద పడుతుంది. అలాగే బయటి ప్రపంచలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉండాలి. అందుకోసం రోజూ న్యూస్ చూడటం, పత్రికలు, పుస్తకాలు చదవడం వంటివి చేయాలి. మీరు నివసిస్తున్న ప్రాంతంలో, వర్క్ ప్లేస్‌లో ఖాళీ సమయం దొరికినప్పుడు ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మొత్తానికి మీ అంతట మీరు ఉండకుండా, చుట్టు పక్కల సమాజంతో ఏదో ఒక విధంగా కనెక్ట్ అవ్వండి. పరిణామాలను పరిశీలంచడం, విశ్లేషించుకోవడం, అర్థం చేసుకోవడం చేస్తూ ఉండాలి. వివిధ సమావేశాల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, చావులు వంటి శుభ కార్యాల్లో పాల్గొనండి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మీకు అవసరమైన విషయాలను అవగతం చేసుకోండి. ఇవన్నీ మీలో సామాజిక సంబంధాలను, నైపుణ్యాలను మెరుగు పర్చుకునేందుకు సహాయపడతాయంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story