- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ఆ విషయంపై మరోసారి మాట్లాడిన అగ్రతార సమంత..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర నటి సమంత(Samantha) మయోసైటిస్(Myositis) వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ఈ వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల బాట పట్టింది. రీసెంట్‌గానే సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్(Citadel web series) ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత.. మరోసారి మయోసైటిస్ వ్యాధి గురించి చర్చించింది. ఫస్ట్ టైమ్ దాని లక్షణాలు కనిపించిన డేస్‌ను గుర్తుచేసుకుంది. ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ‘కాఫీ విత్ కరణ్’(Coffee with Karan) లో పాల్గొన్నప్పుడు బాడీ అంతా చాలా వీక్‌గా అనిపించిందని వెల్లడించింది.
అస్సలు ఓపిక లేకపోయినా.. ఆ టాక్ షో కంప్లీట్ చేశానని.. అనంతరం హైదరాబాదు(Hyderabad)కు వెళ్లానని తెలిపింది. షో లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నానని.. ప్రజెంట్ కెరీర్ పైన ఫోకస్ పెట్టాలంటూ వివరించింది. ఇక తర్వాత నెక్ట్స్ డే ‘ఖుషి’(Khushi) షూటింగ్ కు వెళ్లానని.. షూటింగ్ లో చాలా ఇబ్బంది పడ్డానని, బాడీ అంతా షట్ డౌన్ మోడ్‌లోకి వెళ్లిందని తెలిపింది. ఇక ఆ క్షణం నుంచి హెల్త్ మొత్తం క్షీణించడం ప్రారంభమైందని వెల్లడించింది. అసలు ఏ జరుగుతుందో తెలియడం లేదని.. మయోసైటిస్ వ్యాధి అని గుర్తించడానికి చాలా టైమ్ పట్టిందని, తర్వాత కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటూ సామ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.