- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమనాశ్రయాన్ని తలపించేలా రైల్వేస్టేషన్.. రూ.430 కోట్లతో ఆధునీకరణ
భారతీయ రైల్వేలో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ (ఏబీఎస్ ఎస్) కింద తెలంగాణవ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్లను రూ.1830.4 కోట్లతో ఆధునీకరిస్తున్నది. ఇందులో భాగంగానే చర్లపల్లిలో ‘శాటిలైట్ రైల్వే టెర్మినల్’ ను రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. సకల వసతులతో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ ఏయిర్ పోర్టును తలపిస్తోంది. దీంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నగరంలో నేడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. విమానశ్రయాన్ని తలపించేలా రూపొందిన టర్మినల్ అందరినీ ఆకట్టుకున్నది. ఎత్తైన ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం ఉండడంతో స్టేషన్ దిగువన ఫ్లాట్ ఫాంలను నిర్మిస్తున్నారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రాబోతున్నది. - కల్లేపల్లి రవిచంద్ర
నాలుగో అతిపెద్ద స్టేషన్
మహానగరంలో ప్రస్తుతం ఉన్న నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు తోడుగా చర్లపల్లి మరో భారీ రైల్వే స్టేషన్‌గా అవతరించబోతున్నది. చర్లపల్లిలో రూ.430 కోట్ల వ్యయంతో అధునిక సౌకర్యాలతో రైల్వే టెర్మినల్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ టెర్మినల్ రాకతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి గణనీయంగా తగ్గిపోనున్నది. ఇక్కడినుంచే ప్రయాణికులు నగరం నలుమూలలకు సులువుగా చేరుకునే వీలున్నది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా కొత్తగా మరో 25 జతల రైళ్లు ఇక్కడినుంచి పరుగులు తీయనున్నాయి. లక్షల్లో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీయనుంది.
మోడ్రన్ రైల్వే టెర్మినల్
రెండు అంతస్తులతో సిద్ధమవుతున్న చర్లపల్లి స్టేషన్ వాస్తవానికి ఒక మోడ్రన్ టెర్మినల్‌గా ఉంటుంది. ఇందులో 9 ఫ్లాట్ ఫాంలు, 9 లిప్టులు, 5 ఎస్కలేటర్లు, రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు ఫ్లాట్ ఫాంలు పనిచేస్తుండగా, కొత్తగా మరో నాలుగు ఫ్లాట్ ఫాంలను అందుబాటులోకి తెస్తున్నారు. కొన్ని చిన్న చిన్న పనులు మినహా చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. రైల్వే స్టేషన్ కు లింకు రహదారులలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నది. స్టేషన్‌కు సులభంగా చేరుకునుందుకు రోడ్డు విస్తరణ చేపట్టింది. ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. 12 రైళ్లు స్టేషన్ లో ఆగేందుకు బోర్డు అనుమతులు జారీ చేసింది.
ఎంఎంటీఎస్‌తో అనుసంధానం..
చర్లపలి రైల్వే టెర్మినల్ లో ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానికంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రైల్వే స్టేషన్ ను చేరుకునే అవకాశం ఉంటుంది. టెర్మినల్ రెండున్నర కిలో మీటర్ల దూరంలో హెచ్ బీ కాలనీ ఎంఎంటీఎస్ స్టేషన్ సిద్ధమైంది. ఇక్కడి నుంచి త్వరలో యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఇది వినియోగంలోకి వస్తే చర్లపల్లి నగరంలోని పలు ప్రాంతాలకు ఎంఎంటీఎస్ ద్వారా త్వరగా చేరుకునే వీలుంది.అదేవిధంగా పార్శిల్ కేంద్రాలను నిర్మించారు. ఆర్ఫీఎఫ్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మాణాలను చేపట్టారు. పాదా చారుల వంతెనలు, వాహనాల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
భద్రతకు పెద్దపీట
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ స్టేషన్‌ను నిర్మించారు. స్టేషన్‌ను పూర్తిగా సీసీ కెమెరాలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. నార్త్ లాలా గూడ, చర్లపల్లి, మౌలాలి, ఘట్ కేసర్ ప్రాంతాల నుంచి 500ల చెట్లను తీసుకువచ్చి ట్రాన్స్ లోకేషన్ ప్రక్రియ ద్వారా నాటారు. కోట్ క్లీనింగ్ తోపాటు కోచ్ వాచింగ్ చేసిన నీటిని తిరిగి పునర్వినియోగం చేసేవిధంగా ఏర్పాట్లు చేశారు. భూ గర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశఆరు. నగరంలోనే స్వాతంత్ర్యానికి పూర్వమే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు నిర్మించగా, ప్రస్తుతం పెరిగిన జనాభకు ఈ మూడు స్టేషన్లు సరిపోవడం లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి టెర్మినల్ ను నిర్మించారు.
మణిహారంగా చర్లపల్లి..
మహానగర సిగలో ‘చర్లపల్లి రైల్వే స్టేషన్’ మణిహారంగా మారుతోంది.అత్యాధునిక హంగులతో.. త్వరలోనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ ఏర్పడింది. కాలుష్య రహిత, నివాసయోగ్య ప్రాంతం కావడంతో ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉప్పల్, కాప్రా, కీసర, ఘట్ కేసర్, బోడుప్పల్ తదితర ప్రాంతాలు రూపు రేఖలు మారిపొనున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో అందరి చూపు ఈశాన్య తూర్పు ప్రాంతంపై పడింది. కాప్రా శివార్లలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండేళ్ల వరకు ఇక్కడ గజం భూమి ధర రూ.30వేలు ఉండగా, రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో గజం ధర రూ.50 వేలకు ఎగబాకింది. ఇక కమర్షియల్ ఫ్లాట్లకు ఏరియాను భట్టి రూ.80 వేల నుంచి రూ. లక్షన్నర వరకు గజం ధర పలుకుతోంది. అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లకు సైతం డిమాండ్ పెరిగింది. గతంలో ఒక చదరపు అడుగుకు రూ. 4 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేల దర పలుకుతున్నట్లు రియల్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగారం, రాంపల్లి, బండ్లగూడ , బోడుప్పల్, చర్లపల్లి, ఈసిఐఎల్ లలతో అపార్ట్ మెంట్ల నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. పోచారం, ఘట్ కేసర్ , కీసర, కరీంగూడ, చీర్యాల , గోదుమ కుంట తదితర ప్రాంతాల్లో విల్లాల నిర్మాణాలు ఊపందుకున్నాయి.
రైల్వేల అభివృద్ధికి కేంద్రం కృషి: ఈటల రాజేందర్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు
రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో 38 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రూ.1830 కోట్లను కేటాయించారు. నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లయినా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలపై భారం తగ్గించేందుకు విమనాశ్రయాన్ని తలపించేలా ఆధునిక హంగులతో చర్లపల్లి లో ‘శాటిలైట్ రైల్వే టెర్మినల్’ ను రూ.430 కోట్లతో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధునీకరణ కోసం రూ.700 కోట్లు, చర్లపల్లి స్టేషన్ కోసం రూ.430 కోట్లు, మేడ్చల్ స్టేషన్ కు భారీగా నిధులు కేటాయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయకుండా విస్మరించింది. కేవలం రంగులు వేయడంతోనే సరిపెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ రూ. కోట్లాది రూపాయాలతో రైల్వే ప్రాజెక్ట్‌లు చేపడుతూ.. రైల్వే ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు. త్వరలోనే చర్లపల్లి స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతున్నది.