108లో ప్రసవం - తల్లీబిడ్డ క్షేమం

by Naveena |
108లో ప్రసవం - తల్లీబిడ్డ క్షేమం
X

దిశ, తాడ్వాయి: పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆడశిశువుకి జన్మనిచ్చింది ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో..108 వాహనంలో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికమైయ్యాయి. దీంతో అంబులెన్స్ లోనే సిబ్బంది సాధారణ ప్రసవం చేసి..తల్లి బిడ్డను కాపాడారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని కామారెడ్డి ప్రభుత్వ హాస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి అల్లె సురేష్, పైలెట్ కార్తీక్ లకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story