CV Anand : వాహనదారులు ఇక అలా చేస్తే జైలుకే : సీవీ ఆనంద్

by M.Rajitha |
CV Anand : వాహనదారులు ఇక అలా చేస్తే జైలుకే : సీవీ ఆనంద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై వాహనదారులు ఇష్టానుసారం సైరన్లు(Sirens) మోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. గత 15 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్‌తో ధ్వంసం చేశామన్నారు. సర్పంచుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు వాహనాలకు సైరన్లు బిగించుకొని ఇష్టానుసారం మోగిస్తున్నారని సీపీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెడ్, బ్లూ రంగు బల్బులు, సైరన్లు వినియోగించటం నేరమని స్పష్టం చేశారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్ సైరన్ మోగిస్తుందని సీపీ స్పష్టం చేశారు. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు గతంలో ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ రోప్‌(Road Obstructive Parking Encroachment) కార్యక్రమాన్ని, తాజాగా మంగళవారం మళ్లీ ప్రారంభించారు. ట్రాఫిక్‌ సమస్యను గాడిన పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆగిపోయిన ఆపరేషన్‌ రోప్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed